NTV Telugu Site icon

OIL Recruitment 2024: ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Jobbss

Jobbss

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.. ఆ పోస్టుల పై ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 29వ తేదీ లోపు ఐఓఎల్ అధికారిక వెబ్ సైట్ oil-india.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థులు రూ. 500 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్/ఎక్స్ సర్వీస్ మెన్ కు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది..

మొత్తం ఖాళీల సంఖ్య..

మొత్తం 102 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు, వీటిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ 4, సీనియర్ ఆఫీసర్ 97, ఒక కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ పోస్ట్ ఉంది..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

మీరు ముందుగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా అప్లై చేయవచ్చు.

ముందుగా ఐఓఎల్ అధికారిక వెబ్ సైట్ oil-india.com ను ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీ లో కనిపించే Career ట్యాబ్ పై క్లిక్ చేయండి.
Advertisement No. HRAQ/REC-EX-B/2024-02 DATED 05/01/2024 for Recruitment in Multiple Posts in Grade A, B & C in Executive cadre in OIL.” లింక్ పై క్లిక్ చేయాలి.
స్క్రీన్ పై కొత్త పేజీ డిస్ ప్లే అవుతుంది.
అందులో కనిపించే అప్లికేషన్ ఫారం నింపండి.
అవసరమైన అన్ని డాక్యుమెంట్ లను అప్ లోడ్ చేయండి.
అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి..
ఆ తర్వాత ఫామ్ ను ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి..