NTV Telugu Site icon

Meesho: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..5 లక్షల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

Meesho

Meesho

పండుగల సీజన్ మొదలైంది.. వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి.. దాంతో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ కూడా తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు.. కొద్ది రోజుల క్రితం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లక్ష ఉద్యోగులను నియమించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ క్రమంలో మీషో కూడా 5 లక్షల ఉద్యోగాలను నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రాబోయే పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మీషో ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మునుపటి సంవత్సరంలో కంపెనీ సృష్టించిన సీజనల్‌ జాబ్స్‌తో పోలిస్తే ఇది 50 శాతం పెరుగుదలను సూచిస్తుంది.. ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌, డీటీడీసీ, ఎలాస్టిక్‌ రన్‌, లోడ్‌షేర్‌, డెలివరీ, షాడోఫ్యాక్స్‌, ఎక్స్‌ప్రెస్‌బీస్‌, వంటి మరిన్ని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్‌లతో కొలాబరేషన్‌ ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించాలని మీషో భావిస్తోంది. ఈ అవకాశాలలో ఎక్కువగా 60 శాతం కంటే ఎక్కువ టైర్ 3, 4 ప్రాంతాలలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ జాబ్‌ రోల్స్‌లో డెలివరీ పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం, రిటర్న్ ఇన్‌స్పెక్షన్స్ వంటివి ఉంటాయి.పండుగ సీజన్‌లో 3 లక్షల మందికి పైగా సీజనల్ వర్కర్స్‌ను నియమించుకుంటారు. ఈ టెంపరరీ, గిగ్ వర్కర్స్‌ మీషో సెల్లర్స్‌కు తయారీ, ప్యాకేజింగ్, సార్టింగ్‌తో సహా వివిధ సేవల్లో సపోర్ట్‌ చేస్తారు..

మీషోలో పండుగ సీజన్‌ను వేడుకల కంటే ఎక్కువగా చూస్తాం. ఇది పరివర్తన సమయం. మా కస్టమర్లు, విక్రేతలకు ఆనందం, సర్వీస్‌ అందించే సమయం. ఈ పండుగ సీజన్‌లో డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని ఎదురుచూస్తున్నాం. 5 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు మా విక్రేతలు, థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ భాగస్వాములను ఎనేబుల్ చేసినందుకు సంతోషిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.. అలాగే ఈ పండుగలో కస్టమర్ కు మరింతగా షాపింగ్ ను సులువు చేయడం కోసమే ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలిపారు.. అలాగే చిన్న వ్యాపారాలు, కస్టమర్లకు సాధికారత కల్పించే దిశగా మీషో అడుగులు వేస్తోందన్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి..