NTV Telugu Site icon

SSB Recruitment 2024 : ఎస్ఎస్బీలో భారీగా ఉద్యోగాల భర్తీ.. జీతం ఎంతో తెలుసా?

Ssb

Ssb

నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సశాస్త్ర సీమ బల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 5 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టుల వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (వర్క్) – 03 పోస్టులు

కమాండెంట్ (ఇంజనీర్) – 02 పోస్టులు

వయసు…

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (వర్క్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 56 ఏళ్లు మించకూడదు..

అర్హతలు..

నోటిఫికేషన్ ప్రకారం విద్యార్హతలను కలిగి ఉండాలి.. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

వేతనం..

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (వర్క్)- లెవెల్-13A కింద రూ.131100 నుండి రూ.216600

కమాండెంట్ (ఇంజినీర్) – లెవెల్-13 కింద రూ. 123100 నుండి రూ. 215900 వరకు చెల్లిస్తారు..

చివరి తేదీ.. ఏప్రిల్ 20,2024..

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్‌ను, నింపి దానిని సెకండ్-ఇన్-కమాండ్”, డైరెక్టరేట్ జనరల్, సశాస్త్ర సీమ బాల్, ఈస్ట్ బ్లాక్-V,R K పురం, న్యూఢిల్లీ. – 110066 కి పంపించాల్సి ఉంటుంది..

ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..