NTV Telugu Site icon

SAIL Recruitment 2024: స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Sail Jobs

Sail Jobs

ప్రభుత్వాలు ఈ మధ్య నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 108 ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఎలా అప్లై చేసుకోవాలో వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య.. 108

పోస్టుల వివరాలు..

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు..

సీనియర్‌ కన్సల్టెంట్, కన్సల్టెంట్‌/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, మెడికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ మేనేజర్‌.

నాన్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు…

ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌(బాయిలర్‌), అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌(బాయిలర్‌), మైనింగ్‌ ఫోర్మాన్, సర్వేయర్, ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌(మైనింగ్‌/ఎలక్ట్రికల్‌), మైనింగ్‌ ఫోర్‌మ్యాన్, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ..

అర్హతలు..

ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలు ఉన్నాయి.. పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి…

ఎంపిక విధానం..

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.05.2024

వెబ్‌సైట్‌: https://sail.co.in/ ఈ పోస్టుల గురించి ఏదైన సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.. అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..