NTV Telugu Site icon

IPO: ఐపీఓకి ఎలా అప్లై చేయాలి?

Ipo

Ipo

IPO: స్టాక్‌ మార్కెట్‌ బిజినెస్‌ అంటే ప్రపంచ స్థాయి కంపెనీలతో పార్ట్నర్‌షిప్‌ ఏర్పాటుచేసుకోవటం. షేర్‌ హోల్డర్‌గా మారటం ద్వారా ఆయా కంపెనీలతో కలిసి ప్రయోజనాలను పొందటం. షేర్‌ హోల్డర్‌గా మారటానికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఐపీఓ. ఐపీఓ అంటే ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌. అంటే కంపెనీలు డైరెక్ట్‌గా వాళ్లదాంట్లో వాటాను ఆఫర్‌ చేయటం. చాలా మంది ఏమీ తెలియకుండా ఐపీఓకి అప్లై చేస్తుంటారు. అందువల్ల అసలు ఐపీఓ గురించి తెలుసుకోవటానికి ముందుగా ఏం స్టడీ చేయాలో ఐడియా ఉండాలి.

ఐపీఓకి వచ్చే కంపెనీలు ఏ ఉద్దేశంతో వస్తాయో అర్థంచేసుకోవాలి. ఇందులో భాగంగా రెడ్‌ హెరింగ్‌ ప్రాస్పెక్టస్‌ (ఆర్‌హెచ్‌పీ) గురించి అవగాహన పెంచుకోవాలి. ఆర్‌హెచ్‌పీని సెబీకి ఫైల్‌ చేశాకే ఐపీఓకి రావటానికి కుదురుతుంది. ఆర్‌హెచ్‌పీలో ఏమేమి ఉంటాయో చదువుకోవాలి. ఇది చాలా పెద్ద రిపోర్టు. కాబట్టి ఇందులోని హైలైట్స్‌ను పరిశీలించి ఈ కంపెనీ ఓకేనా కాదా అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవటానికి హెల్త్‌ ట్రీ గ్రూప్‌ ఫౌండర్‌ సీఈఓ ప్రసాద్‌ దాసరి గారు ‘ఎన్‌-బిజినెస్‌’ ఫిన్‌-టాక్‌కి ఇచ్చిన అనాలసిస్‌ని వింటే సరిపోతుంది.