NTV Telugu Site icon

IOCL Recruitment 2024: IOCL లో డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగ అవకాశాలు..ఇలా అప్లై చెయ్యండి..

Iocl Jobs

Iocl Jobs

ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. వరుసగా పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1603 టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 5వ 2024…

అర్హతలు..

12th/ ITI/ డిప్లొమా/ B.A/ B.Com/ B.Sc/ BBA ఉత్తీర్ణత మస్ట్. ఆసక్తి మరియు అర్హత గల దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ iocl.com సందర్శించి 5 జనవరి 2024 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు..

వయో పరిమితి..

18 నుండి 24 సంవత్సరాలు.. వయస్సు సడలింపు,OBC అభ్యర్థులు 3 సంవత్సరాలు,SC/ST అభ్యర్థులు 5 సంవత్సరాలు,PWD (జనరల్) అభ్యర్థులు: 10 సంవత్సరాలు,PWD (OBC) అభ్యర్థులు: 13 సంవత్సరాలు,PWD (SC/ST) అభ్యర్థులు: 15 సంవత్సరాలు ఉంటుంది..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ

దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 5 జనవరి, 2024.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..