ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. ఈ క్రమంలో రైల్వేలో ఖాళీలు ఉన్న పోస్టుల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 1785 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల కు అర్హతలు, చివరితేదీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొత్తం ఖాళీల సంఖ్య: 1785 పోస్టులు..
ఖరగ్‌పూర్ వర్క్‌షాప్, సిగ్నల్ అండ్ టెలికాం (వర్క్‌షాప్) (ఖరగ్‌పూర్), ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్(ఖరగ్‌పూర్), ఎస్‌ఎస్‌ఈ (వర్క్స్)/ఇంజనీరింగ్(ఖరగ్‌పూర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో(ఖరగ్‌పూర్), డీజిల్ లోకో షెడ్(ఖరగ్‌పూర్), సీనియర్ డీఈఈ(జి) (ఖరగ్‌పూర్), టీఆర్‌డీ డిపో/ఎలక్ట్రికల్(ఖరగ్‌పూర్), ఈఎంయూ షెడ్/ఎలక్ట్రికల్(టీపీకేఆర్), ఎలక్ట్రిక్ లోకో షెడ్(సంత్రగచి), సీనియర్ డీఈఈ(జి) (చక్రధర్‌రావు) తదితరాలు..
అర్హతలు..
పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు..
ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, లైన్‌మ్యాన్.
వయసు..
01.01.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.12.2023.
ఈ ఉద్యోగాల కు అప్లై చేసుకొని అభ్యర్థులు వెబ్‌సైట్: https://www.rrcser.co.in/ ను పరిశీలించగలరు..