NTV Telugu Site icon

Indian Coast Guard Jobs : ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్.. నెలకు జీతం ఎంతంటే?

Jobbss

Jobbss

గవర్నమెంట్ జాబ్స్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్టులకు ధరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్​గార్డ్‌లో ఈ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. 70 ​ అసిస్టెంట్​ కమాండెంట్​ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేయొచ్చు.. అర్హతలు, జీతం మొదలగు విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

జనరల్​ డ్యూటీ, టెక్నికల్​ (మెకానికల్), టెక్నికల్ (ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్​) అనే మూడు విభాగాల్లో ​ అసిస్టెంట్​ కమాండెంట్ జాబ్స్‌ను రిక్రూట్ చేస్తున్నారు.

అర్హతలు..

టెక్నికల్​ (మెకానికల్) అసిస్టెంట్​ కమాండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జూలై 1 నాటికి 21-25 ఏళ్లు ఉండాలి. అంటే 1999 జూలై 01 నుంచి 2003 జూన్​ 30 మధ్యలో జన్మించిన వారు అప్లై చేయొచ్చు.టెక్నికల్ (ఎలక్ట్రికల్​ అండ్ ఎలక్ట్రానిక్స్) అసిస్టెంట్​ కమాండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జూలై 01 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 1999 జూలై నుంచి 2003 జూన్ 30లోపు జన్మించిన వారు అప్లై చేయొచ్చు..

జీతం..

ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రారంభంలో నెలకు రూ.56,100 దాకా వేతనం చెల్లిస్తారు..

అప్లికేషన్ ఫీజు..

ఈ జాబ్స్‌కు అప్లై చేసేవారు రూ.300 ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.

ఆన్​లైన్‌లో​ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 19న మొదలై మార్చి 6 వరకు కంటిన్యూ అవుతుంది.
మరిన్ని వివరాల కోసం ఇండియన్​ కోస్ట్​గార్డ్ వెబ్‌సైట్‌లో ఉన్న అధికారిక నోటిఫికేషన్​ను చూడొచ్చు.. ఆ తర్వాత అప్లై చేసుకోవడం మంచిది..