Site icon NTV Telugu

IDBI Jobs 2023: ఐడీబీఐ బ్యాంక్‌లో 2100 ఆఫీసర్ ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

Job Vacancy

Job Vacancy

బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం భారీగా బ్యాంక్ జాబ్స్ ను విడుదల చేసింది.. తాజాగా ఐడీబీఐ బ్యాంక్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఐడీబీఐ బ్యాంక్ మొత్తం 2,100 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. పలు కేటగిరీల్లో జూనియర్ ఆఫీసర్ కేటగిరీకి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

జూనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (జామ్) కోసం 800 పోస్టులు,ఎగ్జిక్యూటివ్-సేల్స్ అండ్ ఆపరేషన్స్ ఈఎస్ఓ కోసం 1300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది..

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 22 నుండి ప్రారంభమవగా..అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 6. అభ్యర్థులు బ్యాంకు వెబ్‌సైట్ idbibank.inలో నిర్ణీత పత్రాలను అప్‌లోడ్ చేసి అప్లై చేసుకోవాలి..

అప్లికేషన్ ఫీజు..

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.200గా నిర్ణయించారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందుగా IDBI బ్యాంక్ అధికారిక సైట్, idbibank.in ని సందర్శించాలి. దీని తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం లింక్‌పై క్లిక్ చేయండి. అప్పుడు అభ్యర్థులు వారి అకౌంట్ క్రియేట్ చేయాలి లేదా లాగిన్ చేయాలి. లాగిన్ అయ్యాక సరైన వ్యక్తిగత, విద్యా,వృత్తిపరమైన వివరాలను నమోదు చేయాలి. దీని తర్వాత అభ్యర్థులు అనుభవ ధృవీకరణ పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు దరఖాస్తు రుసుము చెల్లించండి. దీని తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.. ఆ తర్వాత ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.

Exit mobile version