NTV Telugu Site icon

Hyderabad Jobs : ఐఐటీలో 89 నాన్ టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఏంటంటే?

Job Vacancy

Job Vacancy

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఐఐటీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 89 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా IIT హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22 నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలవ్వగ ..చివరి తేదీ నవంబర్ 12…

పోస్టుల వివరాలు..

జూనియర్ టెక్నీషియన్- 29

జూనియర్ అసిస్టెంట్- 17

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 10

అకౌంటెంట్- 09

స్టాఫ్ నర్స్- 06

టెక్నికల్ సూపరింటెండెంట్- 04

సెక్షన్ ఆఫీసర్- 02

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్- 02

జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 02
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 01

జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్‌)- 01

ఫిజియోథెరపిస్ట్ (మేల్‌)- 01

ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 01

లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01

జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 01

జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01

జూనియర్ హార్టికల్చరిస్ట్- 01

అర్హతలు..

ఒక్కో పోస్ట్ కు ఒక్కో అర్హతను కలిగి ఉంటాయి.. ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి..

అప్లికేషన్ ఫీజు..

దరఖాస్తు రుసుము రూ. 500 . అయితే SC/ST/PWBD/EWS మరియు అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు..IIT హైదరాబాద్ iith.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఎంపిక ప్రక్రియ..

రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

IITH నాన్-టీచింగ్ పోస్ట్‌ల యొక్క వివిధ కేటగిరీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఇన్వైట్ చేసే అప్లయ్ బటన్‌పై క్లిక్ చేయండి Advt No. IITH/2023/NF/15.సూచనలను చదవండి మరియు దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి..ఒక ప్రత్యేక నెంబర్ వస్తుంది.అవసరమైన రుసుము చెల్లించండి. భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు రుసుమును డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసి ఉంచుకోండి.. ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..