NTV Telugu Site icon

Good News From Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ నుంచి బ్యాడ్‌ న్యూసే కాదు. గుడ్‌ న్యూస్‌ కూడా.

Good News From Basara Iiit

Good News From Basara Iiit

Good News From Basara IIIT: తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ నుంచి ఈ మధ్య ఎక్కువగా బ్యాడ్‌ న్యూసే వస్తున్నాయి. ఇటీవల ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, కొంత మంది స్టూడెంట్లు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని రకరకాల వార్తలు వచ్చాయి. వాటిని వింటున్నా, చూస్తున్నా చాలా బాధనిపించేది. అసలు ఎక్కడా లేని ఇలాంటి ఘటనలు అక్కడే ఎందుకు జరుగుతున్నాయని కూడా అనిపించేది. బాసర నుంచి ఇక భరోసా కలిగించే న్యూసే రాదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో గతంలో అక్కడే చదువుకున్న ఒక విద్యార్థి అమేజాన్‌ సంస్థలో జాక్‌పాట్‌ లాంటి జాబ్‌ కొట్టి కొద్ది రోజుల కిందట బాసరకు మంచి పేరు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో శుభవార్త ఇవాళ వెలుగు చూసింది. బాసరలోని ట్రిపుల్‌ ఐటీగా పేరొందిన ఆర్జేయూకేటీ నుంచి 150 మంది విద్యార్థులు నిన్న గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ(టి) హబ్‌ను సందర్శించారు. వర్సిటీలోని ఒక్కో బ్రాంచ్‌ నుంచి 20 మంది చొప్పున స్టూడెంట్స్‌ ఈ ఇండస్ట్రియల్‌ టూర్‌లో పాల్గొన్నారు.

EPFO News: ఈపీఎఫ్‌ఓలో నమోదవుతున్న ఉద్యోగుల సంఖ్య వరుసగా 3వ నెలా.. తగ్గేదేలా..

టీ-హబ్‌ అనేది మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఫేమస్‌ అయింది. ఇదొక వినూత్న వేదిక. సరికొత్త ఆలోచనలతో వచ్చేవారి కలలను సాకారం చేసే కేంద్రం. ‘వన్‌ ఐడియా కెన్‌ ఛేంజ్‌ యువర్‌ లైఫ్‌’ అనే క్యాప్షన్‌కు కార్యశాల.  ఇన్నోవేటర్లకు రెడ్‌ కార్పెట్‌ పరిచి మరీ సాదరంగా ఆహ్వానిస్తుంది. ఎన్నో స్టార్టప్‌లకు పుట్టినిల్లు. అందుకే బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్స్‌ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఫైనలియర్‌ ప్రాజెక్ట్స్‌, ఐడియాస్‌లో భాగంగా స్టార్టప్‌లకు రూపకల్పన చేయాలనుకునే విద్యార్థులకు ఈ స్టడీ టూర్‌ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టీఏఎస్‌కే: టాస్క్‌)తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం కింద ఈ పర్యటనను ఏర్పాటుచేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవటం విశేషం. ఐటీ కోర్సులు పూర్తయ్యాక విద్యార్థుల ముందున్న సదవకాశాలేంటనేది తెలియజేయటానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. టీ-హబ్‌లోని అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకోవాలని ఆర్జేయూకేటీ వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ విద్యార్థులకు సూచించారు.

పారిశ్రామికవేత్తలుగా (వ్యవస్థాపకులుగా) ఎదగాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని, వాటిని బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్స్‌ సద్వినియోగం చేసుకోవాలని టీఎస్‌ఐసీ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాంతా తౌతమ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ-హబ్‌ సీఈఓ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. బాసర ఆర్జేయూకేటీ అంటే కేవలం ఆందోళనలే కాదు ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఉన్నట్లు పేరెంట్ గుర్తించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.