NTV Telugu Site icon

MallaReddy University: విద్యార్ధులకు మల్లారెడ్డి యూనివర్శిటీ రూ.10 కోట్ల స్కాలర్ షిప్ లు

Mallareddy

Mallareddy

MRUCET కామన్ ఎంట్రెన్స్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థిని,విద్యార్థులకు ఆర్ధికంగా వెనకబడి,ప్రతిభావంతమైన పిల్లల కోసం యూనివర్సీటీ నుండి 10కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లను అందిస్తుందన్నారు..ఈ అకాడమిక్ ఇయర్ లో ఇంజనీరింగ్,వ్యవసాయం,పారామెడికల్,మేనేజ్మెంట్ &పబ్లిక్ పాలసీల్లో ఉన్న కోర్సులకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో 2023-24 కి అకాడమిక్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డా..వి.ఎస్.కె రెడ్డి అన్నారు.

ఈ ప్రవేశపరీక్ష ఇండియాలోని అన్ని రాష్ట్రాల బోర్డులు,సెంట్రల్ బోర్డ్,ఇతర గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ లో విద్యార్థుల (రిజిస్ట్రేషన్)ప్రవేశాలకోసం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (MRUCET) ద్వారా ఎప్రిల్23నుండి29వరకు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. తమ యూనివర్సిటీ వెబ్ సైట్ www.mallareddyuniversity.ac.in ని సందర్శించి పూర్తివివరాలు తెలుసుకోవాలని విద్యార్థులకు,తల్లిదండ్రులకు సూచించారు.

Read Also: Bandla Ganesh: నిజమైన పవన్ ట్యాలెంట్ ను బయటకు తీసింది నేనే.. గురూజీ బరూజీ ఎవడు..?

గడిచిన 3సంవత్సరాల కాలంలో తమ యూనివర్సిటీ లో 35 సంవత్సరాలకువపైగా అనుభవం కలిగిన ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ప్రోపెసర్స్ లతో విద్యను అందిస్తూన్నామని,దీనిద్నారా విశ్వవిద్యాలయాల్లో చెరగని ముద్రవేశామన్నారు.ఎమర్జింగ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ లను అందించే మొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీయే మన మల్లారెడ్డి యూనివర్సీటీ అని అన్నారు.

Read Also: Tragedy: కుమార్తె బాధ భరించలేక.. కఠిన నిర్ణయం తీసుకున్న తల్లి