NTV Telugu Site icon

ESIC Recruitment : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు..

Jobs

Jobs

ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మొన్నీమధ్య ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది.. తెలంగాణా పరిధిలో పారామెడికల్‌ స్టాఫ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీలు -70

ఈసీజీ టెక్నీషియన్స్ 8,
జూనియర్ రేడియోగ్రాఫర్ 27,
జూనియర్ మెడికల్ లేబరెటరీ టెక్నాలజిస్టు 13,
మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 1,
ఓటీ అసిస్టెంట్ 15,
ఫార్మశిస్టు 1,
రేడియో గ్రాఫర్ 2,
సోషల్ వర్కర్ 3

అర్హతలు, వయోపరిమితి..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. అభ్యర్ధుల వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి..

ఇకపోతే రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఫీజు రాయితీ ఇతరులకు వర్తిస్తుంది… ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు..ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ ; www.esic.gov.in పరిశీలించగలరు..