Site icon NTV Telugu

CSL Apprentice Recruitment : కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు..

Job Vacancy

Job Vacancy

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 308 అప్రెంటిస్ లను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు.. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్ (జనరల్)/పెయింటర్ (మెరైన్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్/రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్/ఆఫీస్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ సహా వివిధ విభాగాలలో ఈ అప్రెంటిస్ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి..

అర్హతలు..

అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి… నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఏదైనా ఒక ట్రేడ్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.. టెక్నీషియన్ (వొకేషనల్) అప్రెంటీస్ – ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో, సంబంధిత ట్రేడ్‌లకు వర్తించే నిర్ణీత అర్హతలో పొందిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల షార్ట్-లిస్ట్ చేయబడుతుంది.. వారికి ఇంటర్వ్యూ పెడతారు.. అక్కడ సెలెక్ట్ అయినవారికి ట్రైనింగ్ ఇస్తారు..

ఇకపోతే ఎంపికైన వారికి ITI ట్రేడ్ అప్రెంటీస్-₹ 8,000/, టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్-₹ 9,000/- నెలకు స్టైఫండ్ చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే వారికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం అక్టోబర్ 4, 2023 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://cochinshipyard.in పరిశీలించగలరు.. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ను పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవడం మంచిది..

Exit mobile version