NTV Telugu Site icon

CRPF Recruitment 2023: CRPFలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ. 75 వేలు జీతం..

Jobs

Jobs

పోలీస్ ఉద్యోగం చెయ్యాలానుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16 పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 16 ఖాళీ పోస్టుల్లో క్వాలిఫైడ్ అభ్యర్థులను రిక్రూట్ చేస్తారు. ఈ నియామకాలు వివిధ NDRF యూనిట్లు/CRPF యూనిట్లు, CRPF ఆసుపత్రులలో జరుగుతాయి. ఒప్పందంపై నియామకం ప్రారంభంలో 3 సంవత్సరాలు ఉంటుందని, గరిష్ట వయస్సు 70 సంవత్సరాల షరతుపై మరో 02 సంవత్సరాలు పొడిగిస్తారని తెలుస్తుంది..

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి MBBS డిగ్రీని కలిగి ఉండాలి. అంతేకాకుండా, వారి ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేయాలి..

జీతం..

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి ప్రతి నెలా రూ.75,000 జీతం ఇవ్వబడుతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు, వారు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల ఒరిజినల్, ఫోటోకాపీలు, దరఖాస్తు చేసిన పోస్ట్ పేరు సాదా కాగితంపై తీసుకురావాలి. 5 పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు. తప్పనిసరిగా ఫోటో తీసుకురావాలి. ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులకు మెడికల్ టెస్టులు.. ఇతర టెస్టులు కూడా ఉండనున్నాయని వెబ్ సైట్ లో పేర్కొన్నారు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..