Education: మెడికల్ ఫీల్డ్ లో ప్రవేశించాలని.. డాక్టర్ గా, డెంటిస్ట్ గా, వెటర్నరీ డాక్టర్ గా ఇలా మెడికల్ రంగంలో తమ ప్రతిభను చూపించి, తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని.. పది మందికి సేవ చెయ్యాలి.. అనే కల విద్యార్థుల్లో చాలా మందికి ఉంటుంది. అందుకోసం విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి చదువుతుంటారు. మెడికల్ ఫీల్డ్ లో ప్రవేశించాలి అనుకునే విద్యార్థులకు ప్రభుత్వం రీయంబర్స్మెంట్ కూడా ఇస్తుంది. అందుకోసం ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు “నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్” అనే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. కాగా ప్రస్తుతం విద్యార్థులకు ఒత్తిడి భారాన్ని తగ్గించే క్రమంలో నేషనల్ మెడికల్ కమిషన్.. నీట్ సిలబస్ లో భారీ మార్పులు చేసింది.
Read also:Dry Coconut : ఎండు కొబ్బరిని రోజు తినవచ్చా..?
కాగా ఈ సంవత్సరంలో నీట్ ప్రవేశ పరీక్ష “మే” లో జరగనుంది. NMC విడుదల చేసిన సిలబస్ ప్రకారం.. రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ), భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), జంతు శాస్త్రం(జువాలజీ), వృక్ష శాస్త్రం ( బోటనీ) లలో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. భౌతిక శాస్త్రం సిలబస్ లో భారీగా తగ్గించారు. రసాయన శాస్త్రంలో కొన్ని పాఠాలను తీసేసారు. కాగా జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రంలో స్వల్ప మార్పులు చేశారు. మరింత సమాచారం కోసం http://nmc.org.in/ ఈ వెబ్ సైట్ ను సంప్రదించ వచ్చు. కాగా ఆలస్యంగా సిలబస్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నీట్ ప్రవేశ పరీక్ష రాయబోతున్న విద్యార్ద్దులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాగా ప్రస్తుతం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఇది ఉపయోగపడుతుందని చాల మంది అభిప్రాయ పడుతున్నారు.