NTV Telugu Site icon

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిన్స్‌ లిమిటెడ్‌ లో అప్రెంటిస్ పోస్టులు..ఇలా అప్లై చేసుకోండి..

Bel Jobss

Bel Jobss

కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ కార్యాలయాల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిన్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 115 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 15, 2024. ఆ లోపు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ ల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫిబ్రవరి నెల మొదటి వారంలో జరగనుంది.

పోస్టుల వివరాలు..

మెకానికల్ ఇంజనీరింగ్: 30 పోస్టులు

కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్: 15 పోస్టులు

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 30 పోస్టులు

సివిల్ ఇంజనీరింగ్: 20 పోస్టులు

మోడ్రన్ ఆఫీస్ మేనేజ్ మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్: 20 పోస్టులు..

అర్హతలు..

జనరల్ కేటగిరీ, ఆర్థికంగా వెనుకబడిన కేటగిరీల వారికి ఈ జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 23 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

బీఈఎల్ నిర్వహించే రాత పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఈ పోస్ట్ లకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 2024 ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ద్వారా రాతపరీక్షకు సమాచారం అందిస్తారు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్ ను చూసి అప్లై చేసుకోగలరు…