NTV Telugu Site icon

APPSC Notification 2024: ఏపీలో పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

Jobbss

Jobbss

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ వరుస గుడ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. మొన్న దేవాదాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో పాలిటెక్నిక్‌ కాలేజీలో లెక్చరర్‌ పోస్టులును భర్తీ చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య..99

పోస్టుల వివరాలు..

ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్‌-01, ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌-08, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌-02, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌-12, సిరామిక్‌ టెక్నాలజీ-01, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌-04, కెమిస్ట్రీ-08, సివిల్‌ ఇంజనీరింగ్‌-15, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌-08, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌-10, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌-02, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌-01, ఇంగ్లిష్‌-04, గార్మెంట్‌ టెక్నాలజీ-01, జియాలజీ-01, మ్యాథమేటిక్స్‌-04, మెకానికల్‌ ఇంజనీరింగ్‌-06, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌-01, మైనింగ్‌ ఇంజనీరింగ్‌-04, ఫార్మసీ-03, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ-03..

అర్హతలు..

సంబంధిత బ్రాంచ్‌లో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ విభాగానికి పీజీతోపాటు ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్‌గ్రేడ్, షార్ట్‌హ్యాండ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ ఉత్తీర్ణులై ఉండాలి..

వయసు..

01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం..

ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుంచి రూ.98,400.

ఎంపిక విధానం..

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 29.01.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.02.2024.
రాతపరీక్ష తేది: ఏప్రిల్‌/మే 2024.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/ లో ఈ పోస్టుల గురించి వివరంగా తెలుసుకోగలరు..