Site icon NTV Telugu

Waking Up to Alarm Increases Heart Attack Risk: మార్నింగ్ అలారం పెట్టుకుంటే ప్రమాదమా..?

Sam (1)

Sam (1)

చాలా మంది ఉదయాన్నే లేవాలంటే బద్దకిస్తారు.. కొంత మంది టైంకి లేవాలని.. అలారం పెట్టుకుని పడుకుంటారు. అలారం మోగే సరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తారు. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వర్జీనియా విశ్వవిద్యాలయం అధ్యయనంలో తెలిసింది. 32 మందిపై చేసిన ఈ పరిశోధనలో, అలారం ఉపయోగించి లేచిన వారిలో రక్తపోటు 74 శాతం పెరిగిందని కనుగొన్నారు. సహజంగా లేచేవారితో పోలిస్తే ఇది గణనీయమైన వ్యత్యాసం.

పొద్దున్నే నిద్రలేవడానికి చాలా మంది అలారం పెట్టుకుంటారు. ఉదయమే ఆఫీస్‌కు వెళ్లేందుకో, కాలేజ్‌కు వెళ్లేందుకో లేదా మరేదైనా పని ఉన్నా.. ఆ సమయానికి లేవలేము అనుకునే వాళ్లంతా అలారంపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారందరికీ మతిపోయే షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే.. అలారం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటా.. యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విషయాన్ని వింటే మీరే షాకవుతారు.
మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. పొద్దుపొద్దున్నే వినిపించే అలారం మోతతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ముప్పును పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో తేలింది. 32 మందిపై ఈ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. రెండు రోజులపాటు వారంతా నిద్రలో స్మార్ట్ వాచ్లు, ఫింగర్ బ్లడ్ ప్రెజర్ కఫ్స్ ధరించి పాల్గొన్నారని చెప్పారు. మొదటిరోజు ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్రలేవమని ఆ 32 మందికి సూచించినట్లు పేర్కొన్నారు. రెండోరోజు.. ఐదు గంటలకు పైగా నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకొని లేవమని చెప్పి, ఈ రెండు ఫలితాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయన్నారు. సహజంగా, బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్ ప్రెజర్‌లో పెరుగుదలను గుర్తించినట్లు తెలిపారు.

సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే బలవంతంగా మేల్కొన్న వారిలో 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ రక్తపోటు పెరుగుదల నిద్ర తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడించారు. అలారం శబ్దం శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుందని, ఆ స్పందన కారణంగా కార్టిసోల్, అడ్రినలిన్ విడుదల అవుతుందన్నారు. ఈ హార్మోన్లు గుండె వేగాన్ని పెంచుతాయని, రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయని చెప్పారు. నిద్రలేవగానే ఇలా బీపీ పెరగడాన్ని మార్నింగ్ బ్లడ్ ప్రెజర్ సర్జ్ అని పిలుస్తారని చెప్పారు. ఇలా ఉదయం పూట అలారంతో బీపీ పెరగడం తాత్కాలికమే అయితే ప్రమాదం లేదు కానీ.. కానీ తరచూ అదే పరిస్థితి ఎదురయితే.. మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారికి ప్రమాదకరమని వెల్లడించారు. అయితే ప్రతీ రోజు ఒకే సమయానికి సహజంగా నిద్రలేచే అలవాటు చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.

Exit mobile version