NTV Telugu Site icon

AIIMS Kalyani Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కళ్యాణిలో ఉద్యోగాలు..

Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. పశ్చిమబెంగాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కళ్యాణిలో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 ఖాళీలను భర్త చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

మొత్తం ఖాళీల వివరాలు..

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01,
అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్: 01,
డైటీషియన్: 04,
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 15,
హిందీ ఆఫీసర్: 01,
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 03,
జూనియర్ ఇంజినీర్: 06,
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: 02,
మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్: 02,
మెడికల్ సోషల్ వర్కర్: 01, ఆప్టొమెట్రిస్ట్: 02, , పీఏ-ప్రిన్సిపల్: 02..
టెక్నీషియన్: 01,
టెక్నీషియన్ (ల్యాబొరేటరీ): 32,
క్యాషియర్: 01,
లాండ్రీ సూపర్‌వైజర్: 02,
లోయర్ డివిజన్ క్లర్క్: 26,
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 10,
స్టెనోగ్రాఫర్: 05,
అప్పర్ డివిజన్ క్లర్క్: 03

ఈ ఉద్యోగాల పై అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు సంబంధించి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.. దివ్యాంగులు అయితే ఎటువంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనేందుకు అధికార వెబ్ సైట్ https://aiimskalyani.edu.in/ ను సందర్శించగలరు…