NTV Telugu Site icon

RRB Jobs 2024: రైల్వేలో 9144 టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

Railway Jobs

Railway Jobs

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, దరఖాస్తు చేసుకొనే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు.. 9144

పోస్టుల వివరాలు..

టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ పోస్టులు 1092 ఉండగా.. టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 21 RRB రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తులు మార్చి 8 నుంచి ప్రారంభం అయ్యాయి.. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

అర్హతలు..

ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలు ఉన్నాయి.. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణలై ఉండాలి..

వయసు..

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు నిండి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇక ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు.. దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు కూడా ఉంటుంది..

దరఖాస్తు ఫీజు..

ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికోద్యోగులు/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్‌/ మైనారిటీ/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250, మిగిలిన వాళ్లకు రూ. 500 చెల్లించాలి..

ఎంపిక ప్రక్రియ..

కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు…

జీతం..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200.. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 జీతంగా చెల్లిస్తారు..

ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే https://indianrailways.gov.in/.. ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు..