Site icon NTV Telugu

Youtuber Deena: గేమ్ చేంజర్.. చివరికి ఆ గేమ్‌కి బలయ్యాడు

Youtuber Deena Suicide

Youtuber Deena Suicide

Youtuber Deena Ends His Life For Not Getting In Youtube: ఆ యువకుడి పేరు డీనా.. ఐఐటి గ్వాలియర్‌లో ఇంజనీరింగ్ డీలర్ చదువుకుంటున్నాడు. మానసిక ఒత్తిడితో పాటు యూట్యూబ్‌లో తాను పెట్టిన గేమింగ్ చానెల్‌కి వ్యూస్ రావడం లేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూట్యూబ్‌లో ప్రత్యేకంగా గేమ్స్ కోసం చానల్ నిర్వహిస్తున్న డీనా.. ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకంటే కొన్ని గంటల ముందే తన యూట్యూబ్‌లో డీనా తాను చనిపోతున్నట్లు ఒక ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ కూడా పెట్టాడు. మరోవైపు చివరిగా ఐదు నిమిషాల పాటు లైవ్లో గేమ్ ఆడాడు. ఆ గేమ్ మొత్తంలో కూడా తన బాధను డీనా వర్ణించుకున్నాడు.

తాను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు పడుతున్న బాధల్ని తన యూట్యూబ్ ఛానల్‌లో సవివరంగా చెప్పాడు. అలాగే చాలామందికి తాను చనిపోతున్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టాడు. కానీ ఎవరు కూడా యూట్యూబర్ చెప్పిన మాటలను నమ్మలేదు. గత రెండు రోజుల నుంచి చాలామందికి యూట్యూబర్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా సమాచారం ఇచ్చాడు. అయినా ఎవరు స్పందించలేదు. దీంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురైన యూట్యూబర్ డీనా.. ఇవాళ ఉదయం 12 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవనంపైకి ఎక్కి కిందకి దూకాడు. అనుమానాస్పద కేసుగా సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు.

చదువులో మంచి చురుకుదనం ఉన్న డీనా.. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. గేమ్ ఛేంజర్ పేరుతో మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్, దాదాపుగా రెండు లక్షల పైచిలుకు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యేకంగా గేమ్స్ వస్తున్న సమయంలో బ్యాగ్రౌండ్ లో మ్యూజిక్ ఆడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడు. దీంతో పాటు సొంతంగా గ్రాఫిక్స్, తర్వాత కొంతమంది పిల్లలు చేత యుద్ధాలు లాంటివి చేయించి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయించుకున్నాడు. ఇలా ప్రతిదాన్ని వెనకాల గేమ్ చేంజర్ తన స్టైల్ లో ముందుకు దూసుకుని వెళ్తున్నాడు.

తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న డీనా.. చాలా కాలం నుంచి డిప్రెషన్‌లో ఉన్నాడు. తన మాటలు, చేష్టలతో ఇవి కనపడుతున్నాయి. అయితే తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. తల్లి రక్షణ రంగంలో చీఫ్ సైంటిస్ట్‌గా కొనసాగుతుండగా.. తండ్రి దక్షిణ మధ్య రైల్వేలో కీలక స్థానంలో ఉన్నాడు. ఐ పాడ్‌తో గేమ్స్ తయారు చేసి, వాటిని అప్లోడ్ చేస్తుంటాడు. మరోవైపు ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా వేల సంఖ్యలో ఫాలోవర్స్‌ని సంపాదించాడు. చాలామంది ప్రముఖులతో కూడా డీనాకు పరిచయం ఉంది. తీవ్రమైన మానసిక క్షోభతో కొట్టుమిట్టాడుతున్న డీనా.. ఇటీవల కాలంలో తన మిత్రులందరికీ ఒక సమాచారం ఇచ్చాడు.

తాను ఆత్మహత్య చేసుకోవడానికి 8 గంటల ముందు ఒక సూసైడ్ లెటర్‌ని కూడా అప్లోడ్ చేశాడు. దాంట్లో తాను ఎందుకు చనిపోతున్నానో కారణాల్ని, చిన్నప్పటినుంచి తాను పడ్డ బాధలు, అనుభవించిన కష్టాలన్నీ వర్ణించాడు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి తన తాను శారీరిక గా తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి అయ్యానని, అత్యాచారానికి గురై అయ్యానని కూడా పేర్కొన్నాడు. అలాగే తనను కొంతమంది మోసం చేసినట్లు అందులో తెలిపాడు. తనకు గుడ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరని పేర్కొంటూ, తన చావుకు కారణమైన మొత్తం 8 పేజీల సూసైడ్ లెటర్ ని తన యూట్యూబ్లోనే అప్లోడ్ చేసుకున్నాడు.

చాలామంది ప్రముఖులకు కూడా సోషల్ మీడియా ద్వారా తన లెటర్‌ని, తర్వాత తాను చనిపోతున్నట్లు విషయాన్ని కూడా చెప్పాడు. రెండు రోజులపాటు తన మెసేజ్‌కి ఎవరు రిప్లై ఇవ్వలేదు. ఎవరు కూడా తనను పట్టించుకోలేదన్న భాదతో, ఇవాళ ఉదయం చివరిగా ఒక గేమ్ ఆడాడు. తాను ఉంటున్న భవనం పైకి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. గేమ్ చేంజర్‌గా యూట్యూబ్‌లోకి వచ్చిన డీనా.. అదే గేమ్‌కు బలయ్యాడు.

Exit mobile version