Site icon NTV Telugu

అత్తాపూర్‌లో ఓ యువతి అనుమానస్పద మృతి..

రాజేంద్రనగర్‌లో ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అత్తాపూర్‌ చింతల్‌మెట్‌లోని మెఘల్‌ మెడోస్‌ అపార్ట్‌మెంట్‌లో ఓఫ్లాట్‌లో బ్యూటీషియన్‌ పనిచేసే సుమేరా బేగం అనే యువతి నివాసం ఉంటుంది. అయితే సదరు యువతి ఉంటున్న ఫ్లాట్‌ నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్‌ లోపలికి వెళ్లి చూడడంతో సుమేరా బేగం చున్నీ ప్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవని కనిపించింది.

అయితే గత వారం రోజుల క్రితం సుమేరా బేగం పుట్టినరోజు వేడుకలు జరగినట్లు, పక్కనే పుట్టినరోజు నాడు కట్‌ చేసిన కేక్ ఉండడంతో ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది హత్యా..? ఆత్మహత్యా..? అసలు సుమేరా బేగం ఎక్కడి నుంచి వచ్చింది..? పుట్టినరోజు వేడుకల్లో ఎవరెవరు పాల్గొన్నారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుమేరా బేగం ఓ వ్యక్తి సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version