Site icon NTV Telugu

మద్యం మత్తుకు బలైన మరో యువతి..?

గత శనివారం రాత్రి మొయినాబాద్‌ సమీపంలో ముగ్గురు యువతులు ఒక స్కూటీ వస్తుండగా చెవేళ్ల నుంచి హైదరాబాద్‌కు అతివేగంగా వస్తున్న కారు యువతుల స్యూటీని ఢీ కొట్టింది. దీంతో స్యూటీపై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ప్రేమిక, సౌమ్య, అక్షరలు కిందిపడిపోయారు. అయితే ప్రేమిక తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య, అక్షరలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న అక్షర ఈ రోజు మృతి చెందింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో ఈ ప్రమాదానికి కారణమైన కారును వదిలిపెట్టి డ్రైవర్‌ పరారయ్యాడు. అయితే మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version