ఈ రోజుల్లో క్రికెట్ బెట్టింగ్ బారిన పడి.. ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు. కొందరు చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ డబ్బులు పొగొట్టుకుని.. ఓయో రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also: Health Benefits: రోజు రెండు గుడ్లు తినడం వల్ల..బాడీకి ఎలాంటి లాభాలుంటాయో మీకు తెలుసా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పీఎస్ పరిధిలోని బీరంగూడ కమాన్ పక్కన ఉన్న లావీ షోక్ ఓయో రూంలో అఖిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10వ తేదిన ఓయో రూమ్ కి వెళ్లిన అఖిల్.. తన తండ్రికి ఫోన్ చేసి తాను క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టి మోసపోయనని, బెట్టింగ్ ల కోసం పలువురి వద్ద అప్పులు చేశానని తండ్రికి చెప్పుకున్నాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన గురించి బాధపడొద్దని తెలిపాడు.
Read Also:Heartbreaking: ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ఏం చేశారంటే..
ఓయో రూంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అఖిల్. ఓ యో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అఖిల్ తండ్రి సంగీత్ రావు రామచంద్రాపురం సాయినగర్ లో నివాసం ఉంటున్నరు. కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబసభ్యులు.
