Site icon NTV Telugu

Young Lady Missing:గుడికి వెళ్తున్నానని చెప్పి.. యువతి అదృశ్యం

Collage Maker 29 Aug 2022 03.50 Pm Modified

Collage Maker 29 Aug 2022 03.50 Pm Modified

ఈమధ్యకాలంలో యువతీ, యువకులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. గుడికి అని వెళ్లిన యువతి తర్వాత శవంగా మారింది. భద్రాచలం డంపింగ్ యార్డ్ వద్ద శవమైన యువతి ఉదంతం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బుద్ధి ప్రమీల రాణి (26) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మూడు రోజుల క్రితం భద్రాచలం గుడికి వెళ్ళొస్తానని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Read Also: Akkineni Nagarjuna: ఆ ఫోటో షేర్ చేసి నాగ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరు

ఇవాళ భద్రాచలం డంపింగ్ యార్డ్ లో ప్రమీల మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యనా లేక హత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ రమణల రెండవ కుమార్తె ప్రమీల రాణి. గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక ఉంటుంది. గురువారం రోజు ఇంట్లోంచి బయటకు వచ్చి భద్రాచలం రాముని దర్శించుకుని అనంతరం పార్కులో కూర్చుని ఒంటరిగా డంపింగ్ యార్డ్ వైపుకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజుల క్రితం కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించారు. కుటుంబ సభ్యులు కూడా గాలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆమె కుటుంబ సభ్యులు డంపింగ్ యార్డ్ పక్కన గోదావరి నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలు మతిస్థిమితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైన హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read Also: Krishna Vamsi: అవును.. నేను, రమ్యకృష్ణ వేరుగా ఉంటున్నాం..

Exit mobile version