Site icon NTV Telugu

Road Accident: మాధాపూర్‌లో దారుణం.. యువతి ప్రాణం తీసిన అతివేగం

Madhapur Road Accident

Madhapur Road Accident

Road Accident: మాదాపుర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. అతివేగం కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై స్పీడుగా వెళ్తున్న ఒక స్కూటీ సైడ్‌వాల్‌ని ఢీకొట్టడంతో.. వెనుక కూర్చున్న యువతి ఫ్లైఓవర్‌పై నుంచి కిందకు పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Baby: మరో వారంలో ఓటీటీలోకి కల్ట్ లవ్ స్టోరీ…

మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాండ్‌బండ్ పరిధిలో ఉంటున్న స్వీటీ పాండే (22) అనే యువతి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గురువారం తన స్నేహితుడైన రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్టీయూ నుంచి బయలుదేరింది. అయితే.. రహదారి ఖాళీగా ఉండటంతో రాయన్ అతివేగంగా స్కూటీ నడిపాడు. మాధాపూర్ ఫ్లైఓవర్‌పై రాగానే స్కూటీ అదుపు తప్పి సైడ్‌వాల్‌ని గుద్దుకుంది. ఈ ఘటనలో స్వీటీ ఒక్కసారిగా గాల్లో ఎగిరి బ్రిడ్జిపై నుంచి కిందకు పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రాయన్ ఫ్లైఓవర్ గోడను ఢికోని గాయాలపాలయ్యాడు.

Indian Students: భారతీయ విద్యార్థులకు షాక్‌.. సరైన పత్రాలు లేవంటూ తిరిగి పంపిన అమెరికా

స్థానికులు గమనించి వెంటనే స్వీటీని, రాయన్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే.. స్వీటీ గట్టి దెబ్బలు తగలడం, రక్తస్రావం ఎక్కువ అవ్వడంతో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. రాయన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై మాధాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వీళ్లిద్దరు కలకత్తాకు చెందినవారిగా గుర్తించిన పోలీసులు.. ఘటన గురించి కుటుంబసభ్యులకు తెలియజేశారు.

Exit mobile version