మూడు ముళ్ళు పడ్డాయి. ఏడడుగులు నడిచారు. అంగరంగ వైభవంగా పెళ్ళి అయింది. అయితే ఆ ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. కాళ్ళ పారాణి ఆరకముందే నవ వధువు వారం కాకముందే బలవన్మరణానికి పాల్పడింది. EC నగర్, చర్లపల్లి కి చెందిన ఏకాంతం కుమార్తె శైలజ. వయసు 22 సంవత్సరాలు. ఉప్పల్ లోని TX హాస్పిటల్ లో లాబ్ టెక్నిషీయన్ గా పనిచేస్తోంది. ఆమెకు తన మేనత్త కొడుకు అయిన సతీష్ వయసు 26 ఏళ్ళు. సంగారెడ్డిలోని గడీ డిటర్జెంట్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు.
శైలజ, సతీష్ లకు ఈ నెల 17వత తేదీన లింగగిరి గ్రామం వరంగల్ జిల్లాలో పెళ్లయింది. వివాహానంతరం తిరిగి నిన్న ఈనెల 22వ తేదీ మంగళవారం సాయంత్రం EC నగర్లోని ఇంటికి తిరిగి వచ్చారు. ఇవాళ తన భర్త సతీష్ సంగారెడ్డిలో ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఉదయం సమయం సుమారు 8.30 ని. లకు తన తల్లి బెడ్ రూంలో ఉండగా తను బెడ్ రూమ్ కు బయటనుండి గడియ పెట్టి తను హాల్ లో సెయిలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది. తనకు ఇష్టంలేని పెళ్లి అయినందున ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. మృతురాలి తల్లి లలిత ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కుషాయిగూడ పోలీసులు. వారం రోజులు కూడా కాకుండానే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.
