Site icon NTV Telugu

Lovers Crime News: మూడేళ్ల క్రితమే యువతికి పెళ్లి.. ప్రియుడి కోసం ఆ పని

Couple Commits Suicide

Couple Commits Suicide

Yadagirigutta Lovers Commits Suicide On Railway Tracks: ఆ యువతికి మూడేళ్ల క్రితమే పెళ్లయినా.. పెళ్లి కాకముందే ప్రేమించిన యువకుడిని విడిచి ఉండలేక, అతనితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. వాళ్లిద్దరు కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన నలంద (23) అనే అమ్మాయికి మూడేళ్ల క్రితం యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన యాదగిరితో వివాహం జరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానంలోని లడ్డు తయారీ విభాగంలో యాదగిరి ఉద్యోగం చేస్తున్నాడు.

ఎప్పట్లాగే యాదగిరి తన విధులు ముగించుకొని.. మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లాడు. అయితే.. ఇంటికి వెళ్లి చూసేసరికి భార్య నలంద కనిపించలేదు. ఆమె కోసం గాలించగా.. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దీంతో యాదగిరి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కట్ చేస్తే.. ఈరోజు (బుధవారం) బహుపేట బహుపేట పరిధిలోని రైల్వే ట్రాక్‌ వద్ద రెండు మృతదేహాలు సిబ్బందికి కనిపించాయి. ఈ విషయాన్ని వాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. యాదగిరిగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆ రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎవరని ఆరా తీయగా.. నలంద, గణేశ్‌లుగా పోలీసులు గుర్తించారు.

విచారణలో భాగంగా.. మూడేళ్ల క్రితం పెళ్లి అవ్వడానికి ముందే నలందకు గణేశ్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి చేయడంతో, ఎదురించే ధైర్యం యాదిగిరిని నలంద వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇటు నలంద, అటు గణేశ్ ఒకరినొకరు విడిచి ఉండలేక.. ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడైంది. వారిద్దరి మరణాలతో.. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version