హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టపల్లి ప్రాంతంలో శ్రేన్ ఫాతిమా అనే వివాహిత అనుమానాస్పదoగా మరణించింది. ఆమె వయసు 30 ఏళ్ళు. ఉరి వేసుకుని వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఆరుగురు సంతానం. భర్త గత సంవత్సరo చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం మహిళనే చూసుకునేది.
ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారం అవవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. తల్లి ఆత్మహత్య చేసుకోవడం పిల్లలు అనాథలయ్యారు.