NTV Telugu Site icon

RC Puram Police Station: నిత్యపెళ్ళికొడుకుపై మహిళా సంఘాల ఆగ్రహం

Rcpuram

Rcpuram

ఈమధ్యకాలంలో మహిళల్ని మాయచేసి, ఏమార్చి పెళ్ళిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. డబ్బుల కోసం ఏ పనులకైనా సిద్ధ పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో నిత్యపెళ్ళి కొడుకు కథ వెలుగులోకి వచ్చింది. శివ శంకర్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 పెళ్లి లు చేసుకున్నట్లు మహిళలు ఆరోపించారు. ఈ నిత్య పెళ్ళికొడుకుపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ ముందు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి.

శివశంకర్ పై సైబరాబాద్ పరిధిలో పలు కేస్ లు నమోదు అయ్యాయి. రామచంద్రపురం పీఎస్ ముందు నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలు జాన్సీ తో సహా పలువురు మహిళలు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆందోళన చేశారు. నిత్య పెళ్ళికొడుకుని వెంటనే అరెస్టు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మహిళా సంఘాల ఆందోళనతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

భైంసాలో పెట్రోల్ మోసం

పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పెట్రోల్ తక్కువగా పోయడం, కల్తీ పెట్రోల్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఓ బంక్ లో పెట్రోల్ తక్కువగా వచ్చిదంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. ఓ పెట్రోల్ బంక్ లో ఓ కస్టమర్ 4 లీటర్ల పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే తాను 4 లీటర్లకు డబ్బులిస్తే మూడు లీటర్లే వచ్చిందని సిబ్బందిని నిలదీసారు..అయితే వాహనంలో ఒక లీటర్ కొట్టించగా బాటిల్ లో మూడు లీటర్ల రావాల్సి ఉండగా రెండు లీటర్లు వచ్చిందని వాహనదారుడు ఆరోపించారు.

Crime: భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్య.. ఎందుకంటే?.