Woman Went To Lodge With Her Nephew: రానురాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు లేకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తద్వారా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోయేంత దారుణాలూ జరుగుతున్నాయి. తాజాగా అలాంటి దారుణమే ఒకటి వెలుగు చూసింది. మెడికల్ చెకప్ కోసం వైద్యుడి వద్దకు వెళ్తానన్న ఓ మహిళ.. అల్లుడితో కలిసి లాడ్జికి వెళ్లింది. రాత్రంతా అతనితోనే సమయం గడిపింది. తీరా ఉదయాన్నే చూస్తే, విగతజీవిగా మారింది. భద్రాచలంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Sai Dharam Tej: మెగా ఫ్యామిలీని బాగా వాడేశా.. అందుకే ఎన్టీఆర్ తో
హైదరబాద్‌లో రావూరి అరుణ (35) తన భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 14వ తేదీన అరుణ తనకు కడుపులో నొప్పి వస్తోందని, తన సొంత గ్రామమైన తిరువూరులో వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి.. హైదరాబాద్ నుంచి బయలుదేరింది. కానీ.. ఆమె సొంత గ్రామానికి వెళ్లలేదు. తన భర్త కృష్ణారావు మేనల్లుడు అయిన ఆంజనేయులుతో కలిసి.. భద్రాచలం పట్టణానికి వెళ్లింది. వాళ్లిద్దరు అక్కడ ఒక లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. రోజంతా అదే గదిలో వాళ్లిద్దరూ గడిపారు. అయితే.. ఈ విషయం తెలిస్తే తన పరువు పోతుందన్న భయంతో, అరుణ గదిలో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు పోలీసులకు చెప్పారు. అరుణ ఆత్మహత్య గురించి ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు. అరుణ సూసైడ్ విషయం తెలిసి.. ఆమె కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Sourav Ganguly: కోహ్లీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కి దాదా రియాక్షన్
కట్ చేస్తే.. అరుణ మృతదేహాన్ని పరిశీలించిన ఆమె కుటుంబ సభ్యులు, మెడ చుట్టూ కమిలి ఉన్న గాయాన్ని గమనించారు. దీంతో.. ఆంజనేయులే చీరను అరుణ గొంతుకు చుట్టి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంజనేయులే అరుణని చంపి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు.. సెక్షన్ 302 కింద పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఆంజనేయులే హత్య చేశాడా? లేక పరువు పోతుందన్న భయంతో అరుణ ఆత్మహత్య చేసుకుందా? అసలు వీరిద్దరి మధ్య ఎప్పటినుంచి ఈ వివాహేతర సంబంధం కొనసాగుతోంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.