Woman Throws Acid At Ex-Boyfriend During His Wedding In Chhattisgarh: తమ ప్రేమని అంగీకరించలేదనో లేక తమని మోసం చేశారన్న కోపంతోనే.. అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడులు చేసిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అయితే.. ఛత్తీస్‌గఢ్‌లో అందుకు భిన్నంగా ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి మండపంలో ఓ యువతి.. వరుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఇంతకీ.. దాడి చేసిన ఆ యువతి ఎవరనుకున్నారు? మరెవ్వరో కాదు.. పెళ్లి మండపంలో ఉన్న వరుడి మాజీ ప్రియురాలు. తనని మోసం చేసి, మరొకరితో పెళ్లి చేసుకోబోతున్నందుకు తీవ్ర కోపాద్రిక్తురాలైన ఆ యువతి.. ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనలో వరుడితో వధువు, మరో పది మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..
ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలోని భాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటే అమాబల్ గ్రామంలో దముధర్ బాఘేల్ (25) అనే యువకుడికి 19 ఏళ్ల యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 19వ తేదీన పెద్దలు వీరి వివాహాన్ని నిశ్చయించారు. చాలా గ్రాండ్‌గా వివాహ ఏర్పాట్లు చేశారు. ఆ పెళ్లి మండపంలో మొత్తం సందడి వాతావరణం ఉంది. ఇక కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతోందనగా.. 22 ఏళ్ల యువతి చేతిలో యాసిడ్ పట్టుకొని, నేరుగా వరుడి వద్దకు వెళ్లింది. వెంటనే తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్‌ను అతనిపై పోసింది. అదే కోపంలో వధువుపై కూడా యాసిడ్ పోసింది. ఆమెను అడ్డుకోబోయిన వారిపై కూడా యాసిడ్ పోయడంతో.. వారికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆ యువతి అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన సాయంత్రం జరగడం, అదే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో.. ఈ యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుల్ని ఎవ్వరూ గమనించలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. వరుడి మాజీ ప్రియురాలైన ఈ దారుణానికి పాల్పడిందని తేల్చారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 326ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Shruti Haasan: అక్కడ కొత్త పచ్చబొట్టు.. శృతి నువ్వు మారిపోయావ్..?
ఈ ఘటనపై బస్తర్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివేదిత పాల్ మాట్లాడుతూ.. తాము గ్రామంలో ఏర్పాటు చేసిన కొన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్కాన్ చేశామని, ఇన్ఫార్మర్లనూ యాక్టివేట్ చేసామని తెలిపారు. వరుడు, వధువు నేపథ్యాన్ని తనికీ చేశామన్నారు. సాయంత్రం వేళల్లో ఈ ఘటన జరగడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ప్రజలు నిందితుల్ని గమనించలేకపోయారన్నారు. అయితే.. విచారణలో భాగంగా వరుడి మాజీ ప్రేయసి ప్రమేయం ఉన్నట్లు వెల్లడి కావడంతో, ఆమెను అదుపులోకి తీసుకున్నామన్నారు. గత కొన్నేళ్లుగా తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, అయితే తనని కాదని దమ్రుధర్ మరో మహిళతో పెళ్లికి సిద్ధం అయ్యాడని నిందితురాలు తెలిపినట్లు వెల్లడించారు. అతని పెళ్లి గురించి తెలియగానే.. ఈ దాడికి ప్లాన్ చేసినట్లు పేర్కొందన్నారు. తన గుర్తింపును దాచిపెట్టేందుకు.. పురుషుడి వేషం ధరించి, ఈ దాడికి పాల్పడ్డినట్లు తేలిందన్నారు.