NTV Telugu Site icon

Mumbai Crime: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ప్రైవేట్ భాగాల్లో రాళ్లు, బ్లేడ్!

Auto Driver

Auto Driver

Mumbai Crime: ముంబై మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపరా నివాసి అయిన మహిళ మంగళవారం అర్థరాత్రి గోరేగావ్‌లోని రామ్ మందిర్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానస్పదంగా కనిపించింది. దీంతో ఆమెను విచారించగా.. తాను ముంబైకి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అక్కడ ఓ ఆటో డ్రైవర్ తనపై బలవంతంగా అత్యాచారం చేసిన తన ప్రైవేట్ పార్ట్‌లలో సర్జికల్ బ్లేడ్‌తో పాటు రాళ్లను చొప్పించాడని వెల్లడించింది.

Read Also: BDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. రూ.2.3 కోట్లు చోరీ

అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసాయ్ బీచ్‌లో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత సదరు మహిళ అక్కడి నుంచి తప్పించుకుని రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులను చెప్పింది. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సర్జికల్ బ్లేడ్, రాళ్లతో సహా విదేశీ వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు తేలింది. ఇక, ఆ వస్తువులను వైద్యులు విజయవంతంగా తొలగించారు.. ఇప్పుడు ఆ మహిళ వైద్య సంరక్షణలో ఉంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నాం.. ఇప్పటికే, నిందితుడు ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.