Woman Molested and Killed In Khammam District: ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో దుండగులు ఆమెని అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా ఆమెపై మృగాళ్లాగా విరుచుకుపడ్డారు. అనంతరం ఉదయం ఆమెను ఆసుపత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అయితే.. ఆ మహిళ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఏప్రిల్ 28వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు హత్యాచారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
CM KCR: కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
వరంగల్ జిల్లాలోని చెన్నరావు పేట మండలం రామన్నగుట్ట తండాకు చెందిన లీల అనే మహిళ కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది. తన అత్తతో కలిసి ఈనెల 27వ తేదీన రైలు మార్గం ద్వారా ఖమ్మంకు చేరుకుంది. అక్కడి నుంచి ఆసుపత్రికి ఒక ఆటో మాట్లాడుకొని ఎక్కారు. అయితే.. మార్గమధ్యంలో లీల అత్త యూరినల్ కోసం ఆటో దిగింది. ఆమె కాస్త చెట్ల పొదల్లోకి వెళ్లగానే.. ఆటోలో ఉన్న లీలని తీసుకొని, ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు. ఆమె ఎంత ఆపమని వారించినా.. అతడు పట్టించుకోకుండా, వేగంగా ఆటోని తీసుకెళ్లాడు. మధ్యలో దూకేందుకు లీల ప్రయత్నించింది కానీ, మరీ వేగంగా ఆటో తోలడంతో, ప్రాణభయంతో దూకలేకపోయింది.
DC vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
అలా ఆమెని తీసుకెళ్లిన ఆ ఆటో డ్రైవర్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రంతా ఆమెపై కర్కశత్వం ప్రదర్శించాడు. తనని వదిలిపెట్టమని ప్రాధేయపడినా.. అతడు కనికరించలేదు. ఉదయాన్నే ఆమెను ఆసుపత్రి వద్ద వదిలిపెట్టి, అక్కడి నుంచి పారిపోయాడు. అయితే.. ఆ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆమెను అత్యాచారం చేసిందెవరు? ఎలా చనిపోయింది? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే.. ఈ విచారణను పోలీసులు గోప్యంగా చేస్తున్నట్టు తెలిసింది.