Site icon NTV Telugu

Honour Killing: పరువు హత్య.. ప్రియుడి డెడ్‌బాడీని పెళ్లి చేసుకున్న యువతి..

Aanchal Saksham Tate

Aanchal Saksham Tate

Honour Killing: మహారాష్ట్ర నాందేడ్‌లో ‘‘పరువు హత్య’’ సంచలనంగా మారింది. తన కూతురును ప్రేమించడానే కారణంతో తండ్రి, 20 ఏళ్ల యువకుడిని కాల్చి, తలను రాయితో కొట్టి చంపేశాడు. అయితే, ప్రియురాలు మృతుడి డెడ్‌బాడీని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంచల్, సాక్షం టేట్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆంచల్‌కు తన సోదరుల ద్వారా సాక్షం టేట్ పరిచయమ్యాడు. తరుచుగా సాక్షం టేట్ ఇంటికి వెళ్లే ఆంచల్ క్రమంగా అతడితో సంబంధాన్ని పెంచుకుంది. అయితే, వీరి కులాలు వేరు కావడంతో ఆంచల్ కుటుంబం వీరి సంబంధాన్ని ఒప్పుకోలేదు. అనేక సార్లు బెదిరించినప్పటికీ ఆంచల్, సాక్షం టేట్‌తో తన ప్రేమను కొనసాగించింది.

Read Also: Parliament winter session: రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..‘‘సర్’’పై ప్రతిపక్షాల పోరు..

ఆంచల్ తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటుందనే విషయం తెలిసిన ఆంచల్ సోదరులు, తండ్రి సాక్షం టేట్‌ను తీవ్రంగా కొట్టి, తలపై కాల్చి, తలను రాయితో పగలగొట్టి చంపారు. అతడి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆంచల్, సాక్షం ఇంటికి వెళ్లి మృతదేహంపై ఉన్న పసుపు, కుంకుమను నుదుట పెట్టుకుని, ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత, తన జీవితాంతం సాక్షం ఇంట్లోనే కోడలిగా ఉండాలని నిర్ణయించుకుంది. సాక్షం మరణంలో కూడా తమ ప్రేమే గెలిచిందని, తన తండ్రి, సోదరులు ఓడిపోయారని చెప్పింది. తన ప్రియుడిని హత్యచేసిన వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది.

Exit mobile version