Site icon NTV Telugu

Madhya Pradesh: తల్లిని లవర్‌తో అభ్యంతరకర స్థితితో చూసిన కుమార్తె.. ఆగమైన కుటుంబం..

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈ కేసులో మహిళలో పాటు ఆమె లవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, మనోహర్ లోధి (45), అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని (18), అతని 16 ఏళ్ల కుమారుడు జూలై 25-26 రాత్రి ఆత్మహత్య చేసుకుని మరణించారు.

Read Also: OG : మరో మాస్ ట్రీట్‌కి రెడీ అయిన ‘ఓజి’ టీమ్ !

మనోహర్ లోధీ భార్య ద్రౌపదికి, మనోహర్ బాల్య స్నేహితుడైన సురేంద్రతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. తన తల్లిని సురేంద్రతో అభ్యంతరకర స్థితిలో చూసిన కూతురు శివాని, ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. ద్రౌపదిని ఈ సంబంధం ముగించాలని కుటుంబం కోరింది. అయతే, సురేంద్ర లేకుండా తాను జీవించలేదని ద్రౌపతి కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పింది. తనపై ఒత్తిడి తీసుకువస్తే, వరకట్న వేధింపులు కేసు పెడగా అని బెదిరించింది.

తన భార్యతో సంబంధం పెట్టుకోవద్దని స్నేహితుడు సురేంద్రను మరోహర్ అభ్యర్థించారు. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో ఉద్రిక్తతలు, గొడవ కారణంగా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మనోహర్ భార్య ద్రౌపదిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Exit mobile version