Site icon NTV Telugu

Bhupalpally Crime: నైస్‌గా భర్తను హత్య చేసింది.. సొంత కూతురిని చంపేసింది.. సంసారం.. ఓ చదరంగం

Crime News

Crime News

Bhupalpally Crime: ప్రియుడి మోజులో పడి కొంత మంది మహిళలు.. ఉన్న కాపురాన్ని కూల్చేసుకుంటున్నారు. ఏకంగా భర్తనో లేదా పిల్లల్నో చంపేసి జీవితాన్ని ఆగమాగం చేసుకుంటున్నారు. ప్రియుడితో సుఖంగా జీవిద్దామనుకుంటున్నారు.. కానీ అసలు జీవితమే కటకటాల పాలవుతుందన్న చిన్న లాజిక్ మిస్సవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఓ మహిళ చేసిన పని ఇప్పుడు ఆమెను ఊసల వెనక్కు నెట్టింది. ఇంతకీ ఆ కంత్రీ మహిళ ఏం చేసింది? కొంత మంది మహిళలు కేవలం సుఖ సంతోషాలు మాత్రమే కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. భర్తతో సంతోషం లేదని.. మరో వ్యక్తిని వెతుక్కుంటున్నారు. సరిగ్గా భూపాలపల్లి జిల్లా వడితలలో ఉండే కవిత ఇలాంటి పనే చేసింది. స్థానికంగా ఉండే యువకునితో కవితకు ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. కానీ అది అక్కడితో ఆగితే ఫరవాలేదు. కానీ ఎక్కడ ఈ విషయం భర్తకు ఎక్కడ తెలుస్తుందోననే ఆలోచన ఆమెలో దెయ్యాన్ని నిద్రలేపింది. ఏకంగా భర్తను కడతేర్చాలని స్కెచ్ వేసింది..

READ ALSO: Revanth Reddy : అవన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్పూర్తితోనే కొనసాగిస్తున్నాం

అనుకున్నదే తడవుగా తన ప్లాన్ అమలు చేసింది కవిత. నైస్‌గా భర్తను హత్య చేసింది. ఈ విషయంపై.. కొంచెం కూడా ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంది. చివరకు భర్త అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. తాను ఊహించినట్లే ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ.. అన్నీ గమనిస్తున్న కూతురు వర్షిణికి డౌట్ వచ్చిందనే అనుమానం మాత్రం ఉంది. కూతురు ద్వారా వివాహేతర బంధం విషయం బయట పడుతుందని భావించింది. దీంతో కన్న కూతుర్ని కూడా కడతేర్చాలని డిసైడ్ అయింది కవిత….

భర్తను హత్య చేసిన కొద్ది రోజులకు కూతురు మర్డర్‌కు కూడా ప్లాన్ చేసింది. దీనికి ప్రియుడు కూడా సహకరించాడు. ఆమెను హత్య చేసి భూపాలపల్లి- కాటారం హైవే పక్కన అటవీ ప్రాంతంలో డెడ్ బాడీని పడేశారు. అక్కడ ఆమె డెడ్ బాడీ పక్కనే ఆధార్ కార్డ్ కూడా ఉంచారు. పక్కన క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లు సృష్టించారు. ఎవరైనా చూసినా.. నరబలి కోసం వర్షిణిని చంపేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారని అనుకున్నారు… కవిత అండ్ ఆమె లవర్ ప్లాన్ బెడిసి కొట్టింది. వర్షిణి హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాలు సేకరించారు. అంతే కాదు కవిత తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. వివాహేతర బంధం రెండు మర్డర్లకు కారణమైందని తెలుసుకుని షాకయ్యారు.. తుచ్ఛమైన ఇల్లీగల్ ఎఫైర్ కోసం.. కన్న కూతురును, కట్టుకున్న భర్తను చంపేసుకున్న కవితను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న కవితను ఉరి తీయాలని కోరుతున్నారు..

READ ALSO: Akshay Kumar Success Story: పాలు అమ్మి.. నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు..

Exit mobile version