NTV Telugu Site icon

Delhi Crime: 26 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్..

Delhi Crime

Delhi Crime

Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఒంటరిగా ఆడవాళ్లు కనబడితే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నోయిడాలోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో 26 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు, స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తితో పాటు మరో కీలక నిందితుడు ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Hit-And-Run Law: కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్ పంపుల వద్ద రద్దీ..

అయితే, ఈ గ్యాంగ్ రేప్ కొన్ని రోజుల క్రితం జరిగింది. నిందితులంతా స్థానికంగా బలమైన వ్యక్తుల కావడంతో యువతి ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇదే అలసుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధిస్తుండటంతో యువతి ధైర్యం చేసి డిసెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సెక్టార్ 39 పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పట్టుబడిన ముగ్గురు నిందితులను రాజ్‌కుమార్, ఆజాద్, వికాస్‌లుగా గుర్తించారు. మరో ఇద్దరు నిందితులు రవి, మెహ్మీ పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. స్థానిక కోర్టు పట్టుబడిన వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.