NTV Telugu Site icon

Uttar Pradesh: ఇస్లాంలోకి మారాలని లవర్ ఒత్తిడి.. మహిళ ఆత్మహత్య..

Up

Up

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమకు అడ్డురాని మతం, పెళ్లికి మాత్రం అడ్డొచ్చింది. ఇస్లాంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని లవర్ చెప్పడంతో ఇది ఇష్టం లేని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో 24 ఏళ్ల షారూఖ్ అనే నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి సీబీఐ సమన్లు.. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి పిలుపు

షారూఖ్, 24 ఏళ్ల యువతితో రిలేషన్ లో ఉన్నాడు. సామాజికంగా ఎదురువుతున్న అవమానాన్ని తట్టుకోవాలంటే ఇస్లాంలోకి మారి పెళ్లి చేసుకో లేకపోతే చావు అని యువతికి చెప్పడంతో ఆమె బుధవారం తన ఇంట్లో సీలింగ్ హుక్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అసిస్టెంట్ సీపీ తేజ్ బహదూర్ సింగ్ తెలిపారు. బాధితురాలికి కొన్నేళ్ల క్రితం నిందితుడు షారూఖ్, సౌరభ్ అనే పేరుతో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడని పోలీసులు గుర్తించారు.

తన కుమార్తెను ఇస్లామిక్ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలని షారూఖ్ వేధించాడని బాధితురాలి తండ్రి ఆరోపించారు. తన కుమార్తెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, ఇస్లాంలోకి మారితేనే తనను పెళ్లిచేసుకుంటానని బెదిరించాడని ఆమె తండ్రి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నాడు. షారుక్‌పై ఐపిసి సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) మరియు యుపి చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం 2021లోని సెక్షన్ 3 మరియు 5 (ఐ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం భూసటోలి, హర్బన్ష్-మొహల్ నుండి అతన్ని అరెస్టు చేశామని, అతన్ని కోర్టు ముందు హాజరుపరిచామని, అక్కడ నుండి జైలుకు పంపినట్లు ఏసీపీ తెలిపారు.

Show comments