CRIME: గర్భం దాల్చడం లేదని, ఇలాగైతే తాను నిన్ను వదిలేసి వేరే మహిళను చూసుకుంటానని భర్త చెప్పడం ఆయన హత్యకు కారణమైంది. ఛత్తీస్‌గఢ్ లోని సుర్గుజా జిల్లాలో బుధవారం ఈ హత్య జరిగింది. 28 ఏళ్ల వ్యక్తిని అతడి భార్య గొడ్డలితో నరికి చంపింది. తనకు బిడ్డను కనివ్వకుంటే తానను వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని బెదిరించడంతో కోపంతో భార్య అతడిని చంపేసింది.
Read Also: Dil Raju : సీఎంతో భేటిపై ఫేక్ వార్తలను ఖండించిన ‘దిల్ రాజు’
బలిరామ్ మాంఝీ అనే వ్యక్తి తన 26 ఏళ్ల భార్య నైహారోతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున మాంఝీ బంధువులు అతని ఇంటికి రావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ఎక్కడా కూడా కనిపించకుండా పోవడం, భర్త విగతజీవిగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, భార్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ప్రాథమిక విచారణలో బాధితుడి తలపై, ముఖంపై గొడ్డలి గాయాలు ఉన్నాయి. హత్య చేసిన తర్వాత అతడి భార్య అక్డి నుంచి పారిపోయింది. తీవ్ర రక్తస్రావంతో మాంఝీ మరణించాడు. భార్యను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సర్గుజా ఏఎస్పీ అమోలక్ సింత్ ధిల్లాన్ తెలిపాడు. పెళ్లియ మూడేళ్లు కావస్తున్న ఈ జంటకు పిల్లలు లేరు. తరుచూ భర్త, భార్యను వేధిస్తుండే వాడు. ఈ విషయమై భార్యభర్తలు నెలరోజులుగా గొడవపడుతున్నట్లు స్థానికులు చెప్పారు. దాడికి ముందు భర్త ఆమెను దూషించాడని, గర్భం దాల్చకపోతే వేరే మహిళను పెళ్లి చేసుకుని, నిన్ను విడిచిపెడతా అని బెదిరించాడని వారు తెలిపారు.