Site icon NTV Telugu

Woman Marries 5 Times: నిత్య పెళ్లికూతురు.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..

Woman Fraud

Woman Fraud

Woman Marries 5 Times: డబ్బులు కోసం అమ్మాయిలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు..అందులో కొన్ని దారుణాలకు కూడా దిగుతున్నారు..ఈజీగా ఉండే మార్గాలను ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.అందులో వరుస పెళ్లిళ్లు చేసుకోవడం, అందిన కాడికి డబ్బులను దండుకోవడం చివరికి చిరునామాను మారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు పోలీసులకు పెద్ద టార్గెట్ అవుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని చెన్నైలో ఈ దొంగ పెళ్లికూతురును అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలిశాయి.

నలుగురిని పెళ్లిళ్లు చేసుకొని డబ్బులు, నగలు తీసుకొని ఉడాయించే నిత్య పెళ్లికూతురును తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన సౌమ్య అలియాస్ శబరి అనే యువతికి పెళ్లైంది. కొన్ని కారణాలతో ఆమె భర్త నుండి విడిపోయింది. ఈ సమయంలోనే ఆమె మోసాలు చేయడానికి అలవాటు పడింది. మోసం చేయడంతో వచ్చిన డబ్బుతో ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేసేది. చాలాకాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారిని ఎంచుకొని, వారే లక్ష్యంగా మోసాలు చేస్తోందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని పెళ్లాడి ఆరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సౌమ్య రెడీ అవుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Sunny Leone: బీచ్ ఒడ్డున బికినీలో సన్నీ సెగలు పుట్టిస్తుందే..

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి పెళ్లి చేసుకున్న భర్తల నుంచి సౌమ్య డబ్బులు, నగలు దోచుకుని ఉడాయించింది. బీకాం చదివిన సౌమ్య.. చివరిగా ఆటోడ్రైవర్‌తో పెళ్లికి రెడీ అయిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు సౌమ్య మూడు సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. విలాస జీవితానికి అలవాటు పడిన ఆమె ఎన్నిసార్లు శిక్షపడినా మళ్లీ అదే పంథాలో వెళ్తోంది.

Exit mobile version