NTV Telugu Site icon

Domestic violence: ఫ్రెండ్స్ ముందు బట్టలు విప్పాలని భార్యపై వేధింపులు..

Domestic Violence

Domestic Violence

Domestic violence: గుజరాత్‌లో ఓ భర్త తన భార్యను దారుణంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తపై బాధిత మహిళ గృహహింస కేసు పెట్టింది. తన భర్త అతని స్నేహితుల ముందు బట్టలు విప్పాలని బలవంతం చేస్తున్నట్లు ఆరోపించింది. 35 ఏళ్ల బాధిత మహిళ తాను ఎదుర్కొంటున్న హింస గురించి ఫిర్యాదు చేసింది. ఖోరాజ్‌కి చెందిన మహిళ, తన భర్త ఇంట్లో పార్టీల సమయంలో అతని స్నేహితుల ముందు బట్టలు విప్పాలని బలవంతం చేసేవాడని, అందుకు ఒప్పకోకపోవడంతో తీవ్రంగా కొట్టేవాడని చెప్పింది.

Read Also: Microsoft global Outage : భారీగా పడిపోయిన క్రౌడ్‌స్ట్రైక్ షేర్లు.. 21 శాతం క్షీణత

తమ వైవాహిక జీవితంలో గత ఐదేళ్లుగా తనపై భర్త గృహ హింసకు పాల్పడుతున్నట్లు చెప్పింది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌కి చెందిన ఇద్దరూ ఎనిమిదేళ్లుగా ఒకరికి ఒకరు తెలుసు. వీరిద్దరు రిలేషన్ ప్రారంభించిన తర్వాత కోల్‌కతాకు అక్కడ నుంచి ముంబై వచ్చినట్లు తెలిసింది. బాధిత మహిళ చిత్ర పరిశ్రమలో VFX ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. పెళ్లి తర్వాత ముంబై వెళ్లామని, తరుచుగా భర్త తన స్నేహితులను పార్టీల కోసం ఇంటికి పిలిచేవాడని ఆమె పేర్కొంది. పార్టీల సమయంలో “ట్రూత్ ఆర్ డేర్” గేమ్ ఆడమని తన భర్త తనను బలవంతం చేసేవాడని ఆమె చెప్పింది.

పార్టీల సమయంలో భర్త తనను బట్టలు విప్పాలని బలవంతం చేసేవాడని, అతని ఇష్టానికి అభ్యంతరం తెలపడంతో కొట్టేవాడని మహిళ ఆరోపించింది. తన భర్త అసభ్యకరమైన డిమాండ్లతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ఆమె పేర్కొంది. భార్తాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల ఈ జంట గుజరాత్ లోని ఖోరాజ్ వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తన భర్త వేధిస్తున్నట్లు మహిళ తెలిపింది.

Show comments