Site icon NTV Telugu

Karnataka: కర్ణాటక ఉడిపిలో దారుణం.. మహిళతో పాటు ముగ్గురు కుమారుల హత్య..

Udipi

Udipi

Karnataka: కర్ణాటక ఉడిపి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ, ఆమె ముగ్గురు కుమారులను గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి చంపారు. బాధితులు తెల్లవారుజామున ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. దుండగులు ముందుగా మహిళను చంపిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చంపారని, వీరి తర్వాత 12 ఏళ్ల కుమారుడిని కూడా చంపేశారని పోలీసులు వెల్లడించారు. 12 ఏళ్ల బాలుడు శబ్ధాలు విని గదిలోకి వెళ్లిన తర్వాత, నిందితుడు ఎలాంటి సాక్ష్యాలు ఉండకుండా అతనిని కూడా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యలు జరుగుతున్న సమయంలో అరుపులు విని ఇరుగుపొరుగు వారు బయటకు వచ్చారు. అయితే వారిని కూడా దుండగులు బెదిరించారు. ఈ దాడిలో మహిళ అత్తకూడా కత్తిపోట్లకు గురైంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు.

Read Also: Shivraj Singh Chouhan: కమల్‌నాథ్ నమ్మలేం.. ఆయన ఈ రాష్ట్రానికి చెందినవాడు కాదు..

ఈ హత్యల్ని ఉడిపి ఎస్పీ ధృవీకరించారు. నేజర్ గ్రామంలో నలుగురు వ్యక్తుల హత్యకు గురయ్యారని.. హసీనా, ఆమె పిల్లల్ని దుండగులు కత్తితో పొడిచి చంపినట్లు వెల్లడించారు. వ్యక్తిగత శత్రుత్వమే హత్యలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, అయితే దీన్ని నిర్ధారించేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఇంట్లో వస్తువుల, డబ్బులు ఏమీ పోలేదని.. ఇది దోపిడికి సంబంధించిన హత్యలు కావని, వేరే ఉద్దేశం ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. హంతకుడికి తల్లి, పిల్లలతో ఏదైనా శత్రుత్వం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

Exit mobile version