Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన అమానుష ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అయితే, స్థానికంగా నివసిస్తున్న రసూల్ అనే డ్రైవర్ భార్య అమ్ముబీ, తన ప్రియుడు లోకేశ్వరన్‌తో కలిసి ఈ ప్లాన్ రూపొందించి అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా, రసూల్, అమ్ముబీ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక, రసూల్ తరచూ ఆమెతో గొడవ పడుతుండటంతో, అమ్ముబీకి అదే గ్రామానికి చెందిన సెలూన్ షాప్ నడిపిస్తున్న లోకేశ్వరన్‌తో పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ తరుచూ కలుస్తున్నట్లు భర్త రసూల్ గుర్తించి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
Read Also: Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
ఇక, ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించిన అమ్ముబీ, లోకేశ్వరన్‌తో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. ముందుగా దానిమ్మరసంలో పురుగుమందు కలిపిన ఆమె, భర్త తాగనని చెప్పడంతో ఆ తర్వాత సాంబార్‌లో కలిపి ఇచ్చింది. ఈ విషం ఉన్న సాంబార్ తిన్న రసూల్ తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. రసూల్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేపట్టారు. కాగా, దర్యాప్తులో వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లు లభించాయి. వాటిలో అమ్ముబీ తన ప్రియుడితో మాట్లాడుతూ, నువ్వు ఇచ్చిన విషాన్ని మొదట దానిమ్మరసంలో కలిపా.. అది తాగకపోయే సరికి.. తర్వాత సాంబార్‌లో కలిపా, చచ్చాడు అని పేర్కొనడంతో పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో లోకేశ్వరన్, అమ్ముబీ ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.
