ఆడపిల్లకు పెళ్లి అంటే.. ఎన్నో భయాలు ఉంటాయి.. కొత్త ఇల్లు.. కొత్త మనుషులు.. కొత్త జీవితం.. అత్తామామలలోనే తల్లిదండ్రులను చూసుకోవాలి. భర్తలోనే స్నేహితుడిని చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా భర్తకు, అత్తమామలకు చెప్పాలి. కానీ వారే సమస్య అయితే.. ఏ ఆడపిల్ల భరించలేని వేధింపులు ఆమెకు ఎదురైతే.. ఆ యువతి పరిస్థితి ఏంటి..? ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న ఒక యువతి తనను ఈ వేధింపుల నుంచి రక్షించాలని పోలీసులను ఆశ్రయించింది.
వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు చెందిన ఓ యువతికి గతేడాది ఫిబ్రవరిలో వివాహం అయ్యింది. ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు భర్త వికృత చేష్టలతో నరకం చూపించాడు. ఎంతో అందంగా ఉంటుందన్న శృంగారాన్ని వికృతంగా మార్చి ఆమెకు విరక్తి కలిగించాడు. ఆ తరువాత కొద్దిరోజులకే మామ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. కొడుకు ఇంట్లోలేని సమయంలో కోరిక తీర్చాలని వెంటపడ్డాడు. మరోపక్క అత్తగారు సైతం అదనపు కట్నం తేవాలంటూ వేధించడం మొదలుపెట్టింది. దీంతో వారి వేధింపులు తట్టుకోలేని ఆమె తనను ఈ రాక్షస కుటుంబం నుంచి కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించింది. భర్తపై అసహజ శృంగారానికి పాల్పడ్డాడని, అత్తమామలు వరకట్నం అడిగారని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
