Case Of Husband Against Wife:ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల బంధం జోక్ గా మారిపోయింది. సోషల్ మీడియా, సినిమాలు.. ఇవన్నీ భార్యను ఒక రాక్షసిలా చూపిస్తూ కామెడీ క్రియేట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే కొంతమంది ఆడవారు భర్తలపై చేసే ఆగడాలకు హద్దులేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడడం, పోలీస్ కేసులు, విడాకులు అంటూ నిండైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ తమ బిడ్డల బంగారం లాంటి భవిష్యత్తును కూడా పాడు చేస్తున్నారు. తాజాగా ఒక భార్య.. తన భర్తపై ఒక సిల్లీ విషయంలో గొడవకు దిగింది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పోలీస్ కేసు వరకు వెళ్ళింది. అసలు ఆ భర్త చేసిన తప్పు ఏంటంటే.. వారి పెళ్లి రోజును మర్చిపోవడం.. ఏంటి ఇంత చిన్నవిషయానికే గొడవ పడిందా..? అంటారా..? అది ఆమె దృష్టిలో చిన్న విషయం కాదు మరీ.. సరే అసలు గొడవలో ఏమైంది అనేది తెలియాలంటే ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
ముంబైకు చెందిన విశాల్ నంగ్రే కు ఐదేళ్ల క్రితం కల్పనతో వివాహమైంది. విశాల్.. కొరియర్ కంపెనీలో పనిచేస్తుండగా.. కల్పన ఫుడ్ అవుట్ లెట్ లో పనిచేస్తోంది. ఇక ఫిబ్రవరి 18 న వీరి పెళ్లిరోజు. పనుల్లో బిజీగా ఉన్న విశాల్ వారి పెళ్లి రోజును మర్చిపోయాడు. దీంతో ఆరోజు ఇంటికి వచ్చిన భర్తపై కల్పన ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి రోజు ఎలా మర్చిపోతావంటూ శివాలెత్తింది. ఆ తరువాత కల్పన తన అన్నలను ఇంటికి పిలిచి పంచాయితీ పెట్టింది. తన భర్త పెళ్లి రోజు మర్చిపోయడాంటు నానా యాగీ చేసింది. ఇక వారు కూడా చెల్లెలి తరుపున మాట్లాడడంతో విశాల్ తల్లి కలుగచేసుకొని సర్దిచెప్పడానికి ప్రయత్నించగా.. కోడలు కల్పన ఆమెపై చేయిచేసుకుంది. వెంటనే విశాల్.. తల్లిని ఆసుపత్రిలో చేర్పించి.. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు కల్పనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.