కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.. తన భర్తను తానే చంపానని ఒక భార్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఆమె తన భర్తను ఎందుకు చంపాల్సివచ్చిందో చెప్పిన కారణం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. గత ఆదివారం జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో పోలీసులు దారుణమైన నిజాలను బయటపెట్టారు.
వివరాలలోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన పలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు ఆర్జించాడు. ఆ డబ్బుతో విలాసంగా జీవిస్తున్నాడు. అతడికి అప్పటికే ఒక మహిళతో వివాహమయ్యింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆరేళ్ల క్రితం పళనిస్వామికి బ్యూటీషియన్ నేత్ర పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఆమెను కూడా పెళ్లి చేసుకొని రెండో కాపురం పెట్టాడు.
కొద్దిరోజులు బాగానే గడిచినా ఆ తరువాత నేత్రను వేధించడం మొదలు పెట్టాడు. భార్యను తన స్నేహితుల వద్దకు వెళ్లి, వారితో పడుకోవాల్సిందిగా కోరేవాడు. ఆ మాటలను విన్న నేత్ర తాను అలాంటిదాన్ని కాను అని చేప్తే.. ఆమెను కొట్టి చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో భర్త వేధింపులను తట్టుకోలేని నేత్ర గత ఆదివారం ఇంట్లో మద్యంమత్తులో ఉన్న భర్తను దారుణంగా కొట్టి చంపింది. అనంతరం డైరెక్ట్ గా మాదనాయకనహళ్లి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగి పోయింది. తనను వేధించడం వలనే భర్తను చంపినట్లు ఆమె ఒప్పుకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
