Wife Killed Her Husband And Father In Law For Property In Uttar Pradesh: భర్త కోట్ల ఆస్తిని దండుకోవడంతో పాటు ప్రియుడితో కలిసి జల్సాగా బతికేందుకు.. ఓ కిలాడీ లేడి తన భర్తని చంపేసింది. తొలుత సుపారీ ఇచ్చి భర్తని చంపించేందుకు ప్లాన్ చేసింది. అది వర్కౌట్ కాకపోవడంతో.. మోతాదుకి మించి నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసింది. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. తన మామయ్యని కూడా లేపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
రెండేళ్ల క్రితం రిషభ్ త్రిపాఠీకి స్వప్నతో వివాహమైంది. రిషభ్ పోలీసు విభాగంలో పని చేస్తుండగా, స్వప్న ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. కట్ చేస్తే.. స్వప్నకు రాజ్‌కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతనితోనే కలిసి జీవితం గడపాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో భర్త పేరు మీదున్న కోటానుకోట్ల ఆస్తిని కూడా కాజేయాలని అనుకుంది. ఈ రెండూ దొరకాలంటే.. భర్తతో పాటు మామని అడ్డుని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. తొలుత ఈ కిలేడీ తన మామయ్యకు మోతాదుకి మించి నిద్రమాత్రలిచ్చి హత్య చేసింది. ఆయనది సాధారణ మృతి అని అనుకోవడంతో.. స్వప్న ఈ కేసు నుంచి తప్పించుకుంది.
ఇక మిగిలింది భర్తే కాబట్టి.. అతడ్ని అంతమొందించేందుకు ఓ గ్యాంగ్‌కి మూడు లక్షల సుపారీ ఇచ్చింది. నవంబర్ 27వ తేదీన ఓ ఫంక్షన్ నుంచి రిషభ్ తిరిగొస్తున్నప్పుడు.. ఓ గ్యాంగ్ అతనిపై దాడి చేసింది. అయితే.. అతడు వాళ్ల నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. గాయాలపాలవ్వడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. భర్త బతికిపోయాడు కాబట్టి.. తన మామని చంపినట్టు భర్తను కూడా చంపేందుకు స్కెచ్ వేసింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్ట్ అయిన రిషభ్‌కి మోతాదుకి మించి నిద్రమాత్రలిచ్చింది. దీండో రెండ్రోజులకే అతని ఆరోగ్యం క్షీణించి.. మృతి చెందాడు.
పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఓవర్‌డోస్ కారణంగా రిషభ్ మరణించాడని తెలియడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా.. స్వప్న బండారం బయటపడింది. కోట్ల ఆస్తి కొట్టేయడంతో పాటు ప్రియుడితో కలిసి జల్సాలు చేసేందుకు ఆమె ఈ పనికి పాల్పడినట్టు తెలిసింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. స్వప్నకి రాజ్‌కుమార్‌తో పాటు ఇంటి దగ్గరలో ఉండే కిరాణా షాప్ ఓనర్ సురేంద్రతోనూ ఎఫైర్ ఉంది. ఈ కేసును ఛేదించే క్రమంలోనే.. మామయ్యను కూడా స్వప్న చంపినట్టు పోలీసులు తేల్చారు.
