ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలు చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే హత్యలు చేస్తున్నారు. దీంతో కొందరు యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కేవలం బీడీ తాగాడని కోపంతో భర్తపై ఇటుకలు, కర్రలతో దాడి చేసి హతమార్చిందో భార్య. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అతడు చనిపోయిన తర్వాత కూడా తనలో కోపం తగ్గకపోవడంతో అతడి శరీరంపై తన్నడం, కొట్టడం వంటివి చేసింది.
Read Also: Bigg Boss : అనారోగ్య సమస్యలతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్..
హర్యానాలోని మహముపూర్ గ్రామానికి చెందిన సురేష్ (60), తన భార్య పూనమ్‌తో కలిసి గర్హి సారాయ్ నామ్‌దార్ ఖాన్ గ్రామంలోని ఒక ఇంట్లో సంవత్సరం నుంచి నివసిస్తున్నాడు. చాలా కాలంగా వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే.. ఆదివారం రాత్రి కూడా వారు గొడవ పడ్డారు. సోమవారం ఉదయం సురేష్ బీడీ తాగుతున్నాడు. ఇది గమనించిన భార్య పూనమ్ అతడి దగ్గరి నుంచి బీడీ లాక్కుంది. దీంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో కోపంతో పూనమ్ సురేష్ పై దగ్గర్లో ఉన్న ఇటుక, కర్రతో దాడి చేసింది. తల, ఛాతీకి తీవ్ర గాయాలు కావడంతో సురేష్ అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన తర్వాత కూడా పూనమ్ కోపం తగ్గలేదు. మంచం మీద కూర్చుని.. తన భర్త శరీరాన్ని పదే పదే తన్నడం, కొట్టడం చేసింది.
Read Also:Fake Agniveer: అగ్నివీర్ సైనికుడు అని చెప్పుకుంటూ.. ప్రయాణీకుల బ్యాగుల చోరీ.. వ్యక్తి అరెస్ట్
ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. సురేష్ బంధువు రాజేష్ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు పూనమ్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలైన పూనమ్ ఎటువంటి సమాధానం చెప్పకుండా.. మౌనంగా ఉంటుందని.. పోలీసులు వెల్లడించారు. పూనమ్ కు ఇద్దరు కూమార్తెలు .. ఒక కుమార్తెకు వివాహం కాగా, మరొక కుమార్తె తన అత్తతో నివసిస్తోంది.
